Studio18 News - ANDHRA PRADESH / : తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయాన్ని సందర్శించిన నటుడు సుమన్ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చొరవ చూపాలని సూచన చిత్ర పరిశ్రమ సమస్యలపై పవన్ కు అవగాహన ఉందని వెల్లడి
సీనియర్ నటుడు సుమన్ తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయాన్ని నేడు తన బంధువులతో కలిసి సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చొరవ చూపాలని కోరారు. నిర్మాతల సమస్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... మంత్రికి సబ్జెక్ట్ తెలిసి ఉంటే సమస్యలు చాలా సులువుగా పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సినీ రంగం గురించి బాగా అవగాహన ఉన్నందున సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలవడం పట్ల సుమన్ హర్షం వ్యక్తం చేశారు. సినీ రంగంలో చాలామంది నటులు, టెక్నీషియన్లు ఇబ్బందుల్లో ఉన్నారని, ఏపీలో విస్తృతంగా షూటింగ్ లు జరిగేలా చర్యలు తీసుకోవాలని, చిన్న స్టూడియోల నిర్మాణం చేపట్టాలని సుమన్ పేర్కొన్నారు. పవన్ సినిమా మనిషి కాబట్టి ఆయనకు నిర్మాతల కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు, ఎగ్జిబిటర్ల కష్టాలు అన్నీ తెలుసని... ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాల మనుగడకు ఆయన మార్గం చూపిస్తారని ఆశిస్తున్నామని సుమన్ తెలిపారు. ఇక అమరావతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు కూడా సహకరించాలని సుమన్ అన్నారు. ఇప్పటికే ఐదేళ్ల కాలం వృథా అయిందని, రాబోయే ఐదేళ్లలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Admin
Studio18 News