Friday, 13 December 2024 09:28:37 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Date : 06 August 2024 03:06 PM Views : 56

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతల అంశంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేతల నియంత్రణకు సీసీ కెమెరాలను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేకపోయిందన్నచంద్రబాబు... ప్రత్యర్ధులను వేధించడానికే పోలీస్ వ్యవస్థను వాడుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలను దేనికి వినియోగిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించగా, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జంపింగ్ చేసే వాళ్లను గుర్తించడానికి వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు. సీసీ కెమెరాలను సిగ్నల్ వద్ద జంపింగ్ చేసే వారినే కాదు, చాలా వాటికి వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు. సీసీ కెమెరాలను ఇంటిగ్రేట్ చేయాలని చెప్పారు. ఎవరైనా నేరాలకు పాల్పడి పారిపోయే ప్రయత్నం చేస్తే వారిని గుర్తించే పరిస్థితి రావాలని అన్నారు. రౌడీ షీటర్లపై నిఘాకు సీసీ కెమెరాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లోనూ సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించారు. చాలా మంది గంజాయి తాగి నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం చర్యల వల్ల నేరగాళ్ల ఇష్టారాజ్యం అన్నట్లుగా పరిస్థితి మారిందంటూ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ.. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడాన్ని తాను ఇష్టపడనని చంద్రబాబు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు