Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణాన్ని 2026 జూన్ లోపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నమని కేంద్రమంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతినెల ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ఉందని అన్నారు. ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. అనుకున్న సమయానికి ముందే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఉదాన్ స్కీమ్ వల్ల మన దేశ విమానయాన శాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైందని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో విమానాశ్రయాలను త్వరలో నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలో కూడా కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలను త్వరలోనే పూర్తి చేయనున్నామని అన్నారు.
Admin
Studio18 News