Studio18 News - ANDHRA PRADESH / : మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడారు. వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటారని చెప్పారు. కానీ విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతోందని అన్నారు. అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు టీడీపీ సానుభూతి పరుడు గౌతమ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పారు. అంతమాత్రాన అతని ద్వారా చంద్రబాబుకు సంబంధం ఉందని మేము చెప్పలేము కదా అని నిలదీశారు. రెండు నెలలు గడిచినా మేనిఫెస్టో అమలు చేయడం లేదని తెలిపారు. తల్లికివందం అడ్రెస్ లేదని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 15 వందలు ఇచ్చేదెప్పుడని నిలదీశారు. ఏ పథకాన్నీ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సరికాదని తెలిపారు. తమ వైపు తప్పులు ఉంటే సూచించాలన్నారు. అలా కాకుండా కేవలం బురదజల్లటమే పనిగా పెట్టుకోవద్దని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని అన్నారు.
Admin
Studio18 News