Thursday, 12 March 2026 03:23:39 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Corporators: విశాఖలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు

Date : 21 July 2024 03:29 PM Views : 474

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రంలో ఎన్నికల అనంతరం వలసల పర్వం మొదలైంది! విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు 'సైకిల్' ఎక్కారు. కార్పొరేటర్లు గోవింద్, కంపా హనూక్, అప్పారావు, నరసింహపాత్రుడు, అప్పలరత్నం, రాజారామారావు, వరలక్ష్మి టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆ ఏడుగురు కార్పొరేటర్లకు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... విశాఖ నగరాభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ద్వారానే విశాఖ అభివృద్ధి జరగాల్సి ఉందని, అందుకే వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకున్నామని వివరించారు. కార్పొరేషన్ మేయర్ గడువుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :