Saturday, 17 January 2026 09:24:57 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Raghuveera Reddy: చంద్రబాబు మడకశిర సభపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రశంసలు

Date : 03 August 2024 11:07 AM Views : 287

Studio18 News - ANDHRA PRADESH / : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. గురువారం మడకశిరలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంపై మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం వంటివి లేవని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఇలా సాదాసీదాగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. అలాగే, మడకశిర నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజలకు చంద్రబాబు స్పష్టమైన హామీలు ఇవ్వడంపైనా రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మడకశిరలో గత పదేళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించే శక్తిని దేవుడు చంద్రబాబుకు, ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి స్వస్తి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు. అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం జరగాలంటే కులగణన చేపట్టాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :