Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YCP MLC Duvvada Srinivas Family Controversy : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. తమ తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉంటున్నాడని.. మా వద్దకు రావాలని ఆయన కుతుళ్లు కోరారు. ఈ మేరకు గురువారం రాత్రి శ్రీనివాస్ నివాసం ఉండే ఇంటికి వద్దకు వెళ్లి తండ్రిని కలిసే ప్రయత్నం చేశారు. కానీ, ఇంటి గేటు తీయకపోవటంతో కారులోనే కొద్దిసేపు ఉండి వెనుదిరిగారు. అయితే, గత రెండేళ్లుగా వారి కుటుంబంలో విబేధాలు కొనసాగుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య జడ్పీటీసీ దువ్వాడ వాణి వేరువేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా తొలగించింది. దువ్వాడ వాణికి బాధ్యతలు అప్పగించింది. మళ్లీ ఎన్నికల సమయానికి దువ్వాడ శ్రీనివాస్ కే టికెట్ కేటాయించారు. ఆ సమయంలో దంపతుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు వాణి ప్రయత్నించినప్పటికీ పార్టీ పెద్దల సూచలనతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అయితే, తాజాగా భార్యాభర్తల మధ్య మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. దీంతో దువ్వాడ కూతుళ్లు రోడ్డెక్కారు. మానాన్న మాకు కావాలంటూ శ్రీనివాస్ నివాసం ఉండే ఇంటివద్దకు వెళ్లారు. దవ్వాడ శ్రీను అక్కవరం ఇంటి వద్ద మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గురువారం రాత్రి దువ్వాడ శ్రీను-వాణిల కుమార్తెలు హైందవి, నవీనలు దువ్వాడ కొత్త నివాసం వద్దకు వెళ్లారు. కారులోనే శ్రీను ఇంటి ముందే వేచిఉన్నారు. తండ్రికి కూతళ్లు ఫోన్ చేసినా, మెస్సేజ్ లు పెట్టినా స్పందన కనిపించలేదు. ఇంటి గేటుకూడా తీయకపోవటంతో వారు కొద్దిసేపు ఉండి వెనుదిరిగి వచ్చేశారు.తమ తండ్రి మరో మహిళతో ఉంటూ తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మా తండ్రి మా వద్దకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
Admin
Studio18 News