Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని, పరోక్షంగా ఎంతోమందికి ఈ హార్బర్ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు 2018లో ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు.
Admin
Studio18 News