Studio18 News - ANDHRA PRADESH / : Food Poisoning : నంద్యాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నంద్యాల వేంకటేశ్వర పురంలోని SDR వరల్డ్ స్కూల్ & SDR జూనియర్ కాలేజిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా 100 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొన్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టళ్లలోనే యాజమాన్యం విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఫుడ్ పాయిజిన్ కారణంగా పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఫుడ్ ఫాయిజన్ అయిన విషయంపై కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకుకూడా స్కూల్ యాజమాన్యం సమాచారం అందించలేదు. ఎవరికి తెలియకుండా కాలేజి, స్కూల్ యాజమాన్యం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులంతా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
Admin
Studio18 News