Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : GVMC Standing Committee Elections : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో విశాఖలో ఎన్నికల వేడి మొదలైంది. రేపు(ఆగస్టు 7) జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. 10కి 10 స్థానాలు గెలవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ సైతం అన్ని స్థానాలను గెలవాలని చూస్తోంది. దీంతో కూటమి సర్కార్, వైసీపీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. కౌన్సిల్ ఏర్పడిన దగ్గరి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ్గా.. ఒక్కసారి కూడా ఒక్క స్థానంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు గెలవలేదు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలవొచ్చని చూస్తున్నాయి ఇరు పార్టీలు. జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కాబోతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కనీసం 5 స్థానాలైనా కైవసం చూసుకోవాలని వైసీపీ చూస్తుంటే.. 10కి 10 స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్ పట్టుదలగా ఉంది. కౌన్సిల్ ఏర్పడి ఇప్పటివరకు మూడుసార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పటికీ.. ఇప్పటివరకు కూడా ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా కూటమి ప్రభుత్వానికి రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది.
Admin
Studio18 News