Monday, 02 December 2024 03:38:10 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nara Lokesh: ఏపీలో ఐటీ, పరిశ్రమ అభివృద్ధి చర్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Date : 09 August 2024 12:15 PM Views : 33

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌ను (ఆర్టీజీఎస్) మరింత మెరుగ్గా రూపుదిద్దాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్ 10 మంది పారిశ్రామిక వేత్తలతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్నోవేషన్ సెంటర్లలో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్‌లకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపర్చాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడి భాగాలు తయారు చేసే యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి సౌరభ్ గౌడ్, ఎండీ ఏపీటీఎస్ రమణారెడ్డి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డి వెంకటాచలం, ఐటీ జాయింట్ సెక్రటరీ సూర్జిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు