Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు ట్రయల్‌ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఓటుకు నోటు కేసును విచారించే ఏసీబీ (హోంశాఖ) ముఖ్యమంత్రి పరిధిలో ఉందని పిటిషనర్ (జగదీశ్ రెడ్డి) కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసు ట్రయల్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్‌లో వైఖరి మారిందని జగదీశ్ రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఎలాంటి విచారణ జరగడం లేదని పేర్కొన్నారు. కేసులో నిందితులుగా సీఎం, హోంమంత్రి ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనూ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పోలీసుల సంగతి తేలుస్తామని వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని... తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని ధర్మాసనం పేర్కొంది. స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని, అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు.
Admin
Studio18 News