Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా బుడమేరును గాలికొదిలేసిన జగన్... ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎంగా ఉన్న ఐదేళ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత జగన్ ఏనాడూ బయటకు రాలేదని చెప్పారు. చంద్రబాబు ఇంటి కోసం బుడమేరు నీటిని డైవర్ట్ చేశారని జగన్ చెప్పడం ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఫేక్ ప్రచారాలను జగన్ మానుకోవాలని... ఆయన చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని చెప్పారు. వరద బాధితుల కోసం యుద్ధప్రాతిపదిక సహాయ సహకారాలను అందించడం చంద్రబాబుకే సాధ్యమయిందని పల్లా శ్రీనివాస్ అన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, బోట్లతో సహాయక చర్యలను చేపట్టారని కొనియాడారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ప్రజాహితం కోరుకోవాలని సూచించారు.
Admin
Studio18 News