Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ సభ్యులు మారుపేర్లతో తమ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి ఉన్మాదుల అరాచకాలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. తన కులం వేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరు అయినా... ఇతర కులాల పేర్లను తగిలించుకుని... కులపిచ్చి, డబ్బు ఆశతో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. "సాధారణంగా పేర్లను మార్చుకునేది ఎవరు? నేరస్తులు, ఉగ్రవాదులు తప్పుడు పేర్లతో చలామణీ అవడం చూస్తుంటాం. కులోన్మాదం, పచ్చ కామెర్లు సోకిన కొందరు టీడీపీ కోసం పేర్ల చివరన రెడ్డి, యాదవ్, గౌడ్ అని పెట్టుకుని... వారి యజమానులు చెప్పిన వారిపై అదే పనిగా బురద చల్లుతున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరుకు బదులుగా మరో పేరుతో చలామణీ అవడం అంటే చచ్చిపోయిన వాళ్ల కింద లెక్క అని అర్థం చేసుకుంటే మంచిది" అని విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.
Admin
Studio18 News