Saturday, 07 March 2026 08:53:34 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Tirupati: ఇంటికొచ్చిన స్నేహితురాలిని భర్తతో అత్యాచారం చేయించిన లా విద్యార్థిని!

Date : 27 July 2024 11:40 AM Views : 346

Studio18 News - ANDHRA PRADESH / : స్నేహితురాలని నమ్మి ఇంటికొచ్చిన యువతికి గంజాయిని అలవాటు చేయడమే కాక, భర్త అఘాయిత్యానికి పాల్పడుతుంటే సహకరించింది. ఆపై ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసింది. బాధితురాలు, నిందితులు ఇద్దరూ కూడా న్యాయవిద్య అభ్యసిస్తుండడం గమనార్హం. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి (22) నాలుగేళ్ల క్రితం తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ కోర్సులో చేరింది. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న క్రమంలో పుదిపట్లలో ఉండే సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ (35)తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిశోర్‌తోనూ బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అతడు ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణకిశోర్ ఇద్దరూ తమ ఇంటికి వచ్చే యువతికి కూడా దానిని అలవాటు చేశారు. ఆమె ఆ మత్తులో ఉండగా కృష్ణ కిశోర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్‌లో వీడియో తీసింది. వాటితో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ బంగారం నగలు లాక్కున్నారు. అక్కడితో ఆగక ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడు, ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారిద్దరినీ అధికారులు యూనివర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :