Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : RK Roja : వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, ఆమె కొండపై మళ్లీ రాజకీయాలు మాట్లాడటం గమనార్హం. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేప్ లు, మర్డర్లు జరుగుతున్నయి. ఆడపిల్లల కాలేజీల బాత్రూంలో హీడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు జరగాలంటే ఎంతో భయం ఉండేదని రోజా అన్నారు. ముచ్చుమర్రి ఘటనలో తొమ్మిదేళ అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలు చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గాని వెళ్లలేదు. మదనపల్లిలో ఫైళ్లు దగ్ధమైయ్యాయి అనగానే డీజీపీని ప్రత్యేక విమానంలో పంపారు. ముచ్చుమర్రికి డీజీపీని, సంబంధిత మంత్రిని ఎందుకు పంపలేదని రోజా ప్రశ్నించారు. గుడ్లవల్లేరు కాలేజీ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారని ఆడపిల్లలు చెబితే ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. 300 మంది ఆడపిల్లలు న్యాయం కావాలని ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగివచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ర్యాగింగ్ భూతం ఎక్కువైందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి చంపేశారు. కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థి చనిపోయారు. ఐదు సంవత్సరాలలోలేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో గమనించాలని రోజా ప్రజలను కోరారు. ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పట్ల పెట్టిన దృష్టి ఆడపిల్లలకు రక్షణ, గౌరవం కల్పించాల్సిన విషయంలో ముందుండాలని రోజా సూచించారు. పార్టీలు మారుతున్న వాళ్లు చేసినది తప్పా కరెక్టా అన్నది ఆలోచించుకోవాలి. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్లని ప్రజలు గౌరవించరని మాజీ మంత్రి రోజా అన్నారు.
Admin
Studio18 News