Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించిన రూ. కోటి తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే ఇరువురి నేతల మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక పవన్ జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
Admin
Studio18 News