Studio18 News - ANDHRA PRADESH / : పట్టపగలు నడిరోడ్డు మీద వైసీపీ కార్యకర్తలను, నేతలను చంపేస్తుంటే మంత్రి లోకేశ్ తిరిగి వైసీపీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల హత్యలపై మాట్లాడకుండా.. చనిపోయిన వారితో పాటు చంపింది కూడా వైసీపీ వాళ్లేనని అబద్ధాలతో దాడి చేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో ఎంతకాలం ఈ రావణ దహనం కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఏ పార్టీ వాళ్లైనా సరే హత్యలను ఎలా సమర్థిస్తారని నిలదీశారు. తుపాకీ పట్టుకోవాలంటూ స్వయంగా ఏపీ హోంమంత్రి అనిత సూచించడం దేనికి సంకేతమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ‘అంతుచూస్తా’.. ‘పాదాలతో తొక్కేస్తా’ అంటే రాజకీయ కక్షతో మాట్లాడుతున్నారని అనుకున్నామని, ప్రభుత్వం ఏర్పడ్డాక నిజంగానే చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలా హింసకు దిగజారుతుందని అనుకోలేదని, టీడీపీ హత్యారాజకీయాలతో ఇటు ప్రజలు, అటు పోలీసు యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
Admin
Studio18 News