Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan Huge Donation : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.6 కోట్లు విరాళం ప్రకటించారు పవన్ కల్యాణ్. ఏపీలో నిన్న చెప్పిన విరాళానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఇక, తెలంగాణకు పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీకి కోటి, తెలంగాణకు కోటి, పంచాయతీలకు 4 కోట్లు.. మొత్తం కలుపుకుని రూ.6కోట్లు విరాళంగా ఇచ్చారు పవన్ కల్యాణ్. అదే సమయంలో వైఎస్ జగన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్. సినిమా వాళ్ల కంటే జగన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని అన్నారు. సినిమా వాళ్ళకి హడావిడి, గోల ఎక్కువ.. సంపాదన తక్కువ.. అని కామెంట్ చేశారు. వరద బాధితుల కోసం ఇప్పటివరకు ఆర్థిక సాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్. వరద ప్రభావిత ప్రాంతాలకు పవన్ కల్యాణ్ భారీ విరాళం * 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం. * రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని నిర్ణయం. * తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం. * ఏపీ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం. * మొత్తం రూ.6 కోట్లు విరాళం.
Admin
Studio18 News