Studio18 News - ANDHRA PRADESH / : ఈజీ మనీ కోసం యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని కడప జిల్లా ప్రొద్దుటూరు డిఎస్పీ మురళీధర్ పేర్కొన్నారు. ఎంతో మంది యువత అన్ లైన్ యాప్ మాయలో పడి డబ్బులు పోగొట్టుకుని, మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నరాన్నారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపైన ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. యువత భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రొద్దుటూరు లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లకు యువత, ప్రజలు దూరంగా ఉండాలని డిఎస్పీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తెలపాలని ఈ సందర్భంగా ఆయన పేర్కోన్నారు.
Also Read : kadapa : ఏఎస్సై ఆత్మహత్య.. రైలు పట్టాలపై మృతదేహం
Admin
Studio18 News