Sunday, 15 March 2026 10:47:41 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదు: పల్లా శ్రీనివాస్, అనిత

Date : 13 August 2024 03:58 PM Views : 297

Studio18 News - ANDHRA PRADESH / : పెద్దల సభను గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖలతో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని చెప్పారు. సంఖ్య తక్కువుగా ఉందని పెద్దల సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామని, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారని చెప్పారు. పెద్దల సభలోనయినా వైసీపీ నేతలు సక్రమంగా వ్యవహరించాలని చెప్పారు. గెలవాలనుకుంటే సులభంగా గెలుస్తాం: అనిత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోంమంత్రి వంగలపూడి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ పోటీ చేయలేదని తెలిపారు. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇప్పుడు పోటీ చేయడం లేదని చెప్పారు. తాము గెలవాలనుకుంటే సులభంగా గెలుస్తామని, మండలి వద్దన్న జగన్ ఇప్పుడు అభ్యర్థిని పోటీకి పెట్టారని అన్నారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ ఓ ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుంచుకోవాలని, అయినా 58 మందితో భద్రత ఇస్తున్నామని తెలిపారు. జగన్ భార్యకు, తల్లికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :