Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Buddha Venkanna : ఐదేళ్ల పాలనలో ప్రజల డబ్బుతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విలాసవంతమైన జీవితం గడిపాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహంపెట్టి కేవలం తన పేరే పట్టుకున్నాడు.. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉంది. అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చునని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. జగన్ తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్. ఇప్పుడు వైసీపీ నేతలు ఏదో జరిగిపోయినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. గతంలో అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. జగన్ సీఎం అయ్యాక రూ. 404కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఇందులోకూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ బుద్దా వెంకన్న విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాలకుకూడా వైసీపీ రంగులు వేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్. అంబేద్కర్ మద్యం మాన్పించాలని చెబితే.. జగన్ మద్యం ఏరులై పారించాడు. మద్య నిషేధం అని ఓట్లు వేయించుకుని.. మద్యంతో కోట్లు దోచాడు. సంపద సృష్టించమని అంబేద్కర్ చెబితే… ఉన్న సంపదను కొల్లగొట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్ రాజా వంటి ఎన్నో పరిశ్రమలను బయటకు పంపించిన జగన్ మోహన్ రెడ్డి.. ఏపీకి పారిశ్రామిక వేత్తలు రావాలంటేనే భయపడేలా చేశాడంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడాడు. బాధిత కుటుంబాలు ను ఎప్పుడైనా సీఎంగా పరామర్శించావా జగన్ అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మీలో మీరుకొట్టుకుని చనిపోతే .. టీడీపీపై నింద వేశావు. 27 సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా జగన్ నిలిపేశాడు. అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్న సైకో జగన్ అంటూ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఎంతమంది దోషులను పట్టుకున్నారో చెప్పాలి. డ్రైవర్ ను చంపిన నీ ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయకుండా పక్కన పెట్టి తిరుగుతున్నావు. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. ఈ విగ్రహం నిర్మాణం, ఖర్చుపై విచారణ చేయాలన్నారు. అమరావతి లో అంబేద్కర్ విగ్రహం కట్టి తీరతామని బుద్దా వెంకన్న చెప్పారు. అధికారం కోల్పోయిన తరువాత ట్విట్టర్ లో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు. సంపద సృష్టి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా జగన్ తెలియదు. చంద్రబాబు సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతాం. జగన్ మళ్లీ వచ్చి ఉంటే రోబోలను పెట్టుకుని ప్రజలను తరిమి కొట్టేవాడు. కులాల చిచ్చు పెట్టి వచ్చే పరిశ్రమ లను ఏపీ రాకుండా జగన్ కుట్ర చేస్తున్నాడు. చంద్రబాబు విజన్, పాలనా దక్షత ముందు నువ్వు, నీ తాత ఆటలు సాగవు. జగన్ ఇప్పుడైనా రాష్ట్ర అభివృద్ధి కి సహకరించు. అడ్డుకునేలా కుట్ర చేస్తే ఈసారి ప్రజలే నిన్ను తరిమి కొడతారని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
Admin
Studio18 News