Studio18 News - ANDHRA PRADESH / : Madanapalle sub collectors office fire Incident : మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్ లో జరిగిన సమీక్షకు సీఎస్, సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంలో సీసీ ఫుటేజ్ తో సహా మొత్తం వివరాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారక తిరుమలరావు మదనపల్లికి బయలుదేరారు. ఇక, ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 24 నిమిషాలకు జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సత్వరం స్పందించకపోవడంపై చంద్రబాబు ఆరా తీశారు. నిన్న రాత్రి 10.30 గంటల వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. ఆ సమయంలో అతడు అక్కడికి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏలు ఉన్నారని చంద్రబాబుకు తెలిపారు అధికారులు. ఘటనా స్థలానికి పోలీస్ జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారని అధికారులు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపైనా చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని, సీసీ కెమెరాలో ఫుటేజీని వెంటనే హ్యాండోవర్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని సూచించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది? అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Admin
Studio18 News