Studio18 News - ANDHRA PRADESH / : వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండలంలోని చిట్లూరు గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదా స్థలాన్ని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కడప చిత్తూరు జాతీయ రహదారిలో వాహనధారులు అతివేగంగా ప్రయాణించడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు అతివేగంగా ప్రయాణించి తమ ప్రాణాలను కోల్పోద్దని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. కడప రాయచోటి ఘాట్ రోడ్డులో త్వరలోనే సొరంగ మార్గం తవ్వి నాలుగు వరుసల రహదారి నిర్మించెందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సొరంగ రోడ్డు మార్గానికి నిధులను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభించి, ఈ ప్రాంత వాసుల చిరకాల కలను నెరవేర్చడం జరుగుతున్నారు...
Also Read : visakhapatnam : వైభవంగా మన్యం ధీరుడు సినిమా ప్రి-రిలీజ్
ADVT
Admin
Studio18 News