Friday, 18 July 2025 05:52:43 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

హోంమంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు.. అధికారులు ఏం చేశారంటే..?

Date : 02 September 2024 11:41 AM Views : 135

Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods : భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి వరదనీటిలోనే బోట్లపై నిర్వారామంగా పర్యటించారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి ఆహారం, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వరద సహాయక కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా హోమంత్రి అనిత విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు. అయితే, విజయవాడలోని హోమంత్రి నివాసాన్నికూడా వరద నీరు చుట్టుముట్టాయి. రామవరప్పాడు వంతెన దిగువన జలదిగ్భందంలో హోమంత్రి అనిత నివసించే కాలనీ ఉంది. ఆమె ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ బృందం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అనిత వారిని ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆమె ఏర్పాట్లు చేశారు. తన ఇంటి వద్దకు వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లి వరద బాధితులకు సహాయసహకారాలు అందించాలని హోమంత్రి సూచించారు. మరోవైపు విజయవాడలో వరద బాధితులకు ఆహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని సీఎం చంద్రబాబు దుర్గగుడి అధికారులతో మాట్లాడారు. ఇవాళ 50వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. మరోవైపు ప్రైవేట్ హాటల్స్ యాజమానులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఉదయంలోపు లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ, బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పలు కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ వరదల కారణంగా తొమ్మిది మంది మృతిచెందారు. కొండచరియలు విరిగిపడి ఆరుగురు, వరదలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్సార్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ – కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :