Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "యువ స్నేహితులందరికీ ఇంటర్నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన థీమ్... "క్లిక్ ల నుంచి పురోగతికి: సుస్థిర అభివృద్ధి కోసం యూత్ డిజిటల్ మార్గాలు" (From Clicks to Progress: Youth Digital Pathways for Sustainable Development). డిజిటల్ విప్లవంలో యువత ముందంజలో ఉన్నారు. యువతే మన రాష్ట్ర, దేశ భవిష్యత్తు. తమ శక్తి, ఉత్సాహం, ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఉత్ప్రేరకాలు. డిజిటల్ పురోగామిపథంలో యువతను కూడా చేర్చి, వారిని శక్తిమంతం చేసి, వారి సామర్థ్యాన్ని పెంపొందించడానికి అంకితభావంతో కృషి చేస్తామని పునరుద్ఘాటిస్తున్నాను. ఈ దిశగా గో ఏపీ (Go AP) చురుగ్గా అడుగులు వేస్తోంది" అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు .
Admin
Studio18 News