Saturday, 07 March 2026 08:12:25 PM
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

Date : 04 August 2024 11:27 AM Views : 292

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుండి రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. రేషన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంను వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు. పేదలకు అందాల్సిన రేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డులకు పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల పౌర సరఫరాల శాఖకు భారీగా నష్టం జరిగిందని ఆయన విమర్సించారు. డోర్ డెలివరీ పేరుతో ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసినా ఎక్కడా డోర్ డెలివరీ జరగడం లేదని మంత్రి నాదెండ్ల అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని మంత్రి నాదెండ్ల అన్నారు. కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :