Studio18 News - ANDHRA PRADESH / : Train Accident in Visakhapatnam railway station : విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. రైలులో మంటలు వ్యాపించిన సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా రైలులో మంటలు వ్యాపించడంతో స్టేషన్ లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Admin
Studio18 News