Saturday, 14 December 2024 03:16:21 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

TGSRTC: పాప్యులారిటీ కోసం ఇలాంటి సోయిలేని ప‌నులు చేయ‌కండి.. సజ్జనార్ ఫైర్‌!

Date : 07 September 2024 02:54 PM Views : 43

Studio18 News - తెలంగాణ / : ఇటీవ‌ల కొందరు సోష‌ల్ మీడియాలో పాప్యులారిటీ కోసం వింత చేష్టల‌కు పాల్ప‌డుతున్నారు. ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా వెర్రి ప‌నులు చేస్తున్నారు. ఇదే కోవ‌కు చెందిన వీడియో ఒక‌టి తాజాగా నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. అది కూడా తెలంగాణ ఆర్‌టీసీకి సంబంధించిన వీడియో కావ‌డంతో దీనిపై టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ స‌జ్జనార్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. వీడియోలో ఓ యువ‌కుడు ఆర్‌టీసీ బ‌స్సును ఆపి, ఆ వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రిగెత్త‌డం ఉంది. త‌న స్నేహితులు ఇచ్చిన ఛాలెంజ్ కోసం ఆ యువ‌కుడు ఇలా చేయ‌డం వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. దీనిపై స‌జ్జనార్ మండిప‌డ్డారు. సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? అని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారంటూ మండిప‌డ్డారు. లైక్‌లు, కామెంట్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాల‌ని సూచించారు. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి, జీవితంలో ఉన్నతంగా ఎదగాల‌ని స‌జ్జనార్ హిత‌వు ప‌లికారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఆ యువ‌కుడిని నెటిజ‌న్లు ఇలాంటి ప‌నులేంటి అని చుర‌క‌లంటిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :