Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బయటపడింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఆదేశించినట్లు లోకేశ్ చెప్పారు.
Admin
Studio18 News