Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. దుండుగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి సుబ్బారాయుడు సన్నిహిత అనుచరుడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులే తన భర్తను హతమార్చారని సుబ్బారాయుడి భార్య ఆరోపిస్తున్నారు.
Admin
Studio18 News