Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేశ్ పలు సూచనలు చేశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్‌లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని అన్నారు. కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం అందించాలని సూచించారు. విపత్తుల కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని చెప్పారు.
Admin
Studio18 News