Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు నేడు గుడివాడ మున్సిపల్ పార్కులో నెలకొల్పిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో స్పందించారు. గుడివాడ మున్సిపల్ పార్కులో చంద్రబాబుతో కలిసి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని ఆమె వెల్లడించారు. అనంతరం తామిద్దరం కలిసి భోజనాలు వడ్డించామని, అంతేకాకుండా, టోకెన్లు తీసుకుని అన్న క్యాంటీన్ లోనే భోజనం చేశామని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని నారా భువనేశ్వరి తెలిపారు. "ఇవాళ ప్రారంభమైన అన్న క్యాంటీన్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్నాను. సామాన్యులందరికీ కేవలం 5 రూపాయలకే రుచి, శుచి కలిగిన భోజనం అందుబాటులోకి రావాలి. రాష్ట్రంలో పేదవాళ్లందరికీ ఆహార భద్రత లభించాలి" అని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు.
Admin
Studio18 News