Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. పదో తరగతి విద్యార్హతతో 39 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చు. ఆన్ లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు ఎస్ఎస్‌సీ వెల్లడించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా, తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాల (సీఆర్పీఎఫ్) తో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ (రైఫిల్ మ్యాన్) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.
Admin
Studio18 News