Friday, 13 December 2024 07:59:13 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Andhra Pradesh: గోదావరి ఒడ్డున కూలిన సినీ వృక్షానికి పునరుజ్జీవనం

Date : 08 August 2024 12:25 PM Views : 104

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గోదావరి నది ఒడ్డున కుప్పకూలిన నిద్రగన్నేరు చెట్టును చిగురింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కుమారదేవంలోని 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ భారీ వృక్షం. ప్రముఖ దర్శకులు, హీరోల సినిమాలలోని ఎన్నో పాటలను ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. కృష్ణ నటించిన పాడిపంటలు సినిమాతో ఈ వృక్షానికి ప్రత్యేక గుర్తింపు వచ్చి... ఆ తర్వాత క్రమంగా సినీ వృక్షంగా పేరు పొందింది. 150 ఏళ్లుగా ఈ వృక్షం ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడింది. అయితే ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు గోదావరి గట్టు కొద్దికొద్దిగా దిగబడుతుండటంతో చివరకు ఈ వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టును తిరిగి చిగురింప చేసేందుకు రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ముందుకు వచ్చింది. కూలిన సినీ వృక్షాన్ని పరిశీలించేందుకు జిల్లా అటవీ శాఖాధికారి నాగరాజు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి కలెక్టర్ పి.ప్రశాంతి వచ్చారు. దీనిని బతికించే కెమికల్ ట్రీట్మెంట్ విధానంపై రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజుతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... 150 సంవత్సరాల చరిత్ర గల ఈ వృక్షం భారీ వర్షాలు, వరదల కారణంగా రెండుగా చీలిపోయిందన్నారు. రోటరీ క్లబ్ సహకారంతో ఆధునిక పద్ధతుల ద్వారా దీనిని బతికించే కృషి జరుగుతోందన్నారు. ఈ చెట్టుతో పరిసర ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు, సినీ పరిశ్రమకు ఎంతో అనుబంధం ఉందన్నారు. కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పటి వరకు పది చెట్లకు ప్రాణం పోశామని, దీనిని కూడా పునరుజ్జీవింప చేస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఛార్టర్ అధ్యక్షుడు రాజా పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు