Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు ఈరోజు వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రిని కలిసి వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతిఒక్కరి వద్దకెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కొందరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో మరికొందరు గత ప్రభుత్వం వేధింపులకు బాధితుల్లా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారి సమస్యలు పరిష్కారిస్తామని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్‌టీఆర్ భవన్ కిటకిటలాడింది.
Admin
Studio18 News