Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Vijayasai Reddy : వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన వీడుతున్నట్టుగా కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన విజయసాయి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. వైఎస్ఆర్‌సీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ పార్టీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానని మీడియాలో ఒక వర్గం చేస్తున్న నిరాధారమైన ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయసాయి ఓటమిని చవిచూశారు. అప్పటినుంచి తాను అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీని వీడుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై స్పందించిన విజయసాయిరెడ్డి తాను వైసీపీలోనే కొనసాగనున్నట్టుగా స్పష్టం చేశారు.
Admin
Studio18 News