Monday, 02 December 2024 12:53:39 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Electricity Bill: విద్యుత్ బిల్లులు గతంలోలాగే ఫోన్ తో చెల్లించ వచ్చు

Date : 17 August 2024 12:51 PM Views : 35

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడనుంది. గతంలో మాదిరిగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐలతో చెల్లించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలో పాత విధానంలోనే నెలనెలా బిల్లులు చెల్లించే వీలు కలుగుతుందని భారత్ బిల్ పే లిమిటెడ్ (బీబీఎల్) సీఈవో నుపూర్ చతుర్వేది పేర్కొన్నారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బీబీపీఎస్) ద్వారా మాత్రమే చెల్లింపులు జరగాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జులై 1 నుంచి యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం కుదరడంలేదు. ఆర్బీఐ నిర్ణయం కారణంగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు స్పందించాయి. బిల్లు చెల్లింపులను సులభతరం చేసేందుకు టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ లతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఏపీసీపీడీసీఎల్ సంస్థలు భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో చేరాయి. ఫలితంగా యూపీఐలతో పాటు బ్యాంకులు, ఇతరత్రా ఫిన్ టెక్ సంస్థల సాయంతో విద్యుత్ బిల్ చెల్లించే అవకాశం వినియోగదారుడికి కలుగుతుందని చతుర్వేది వివరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీడీసీఎల్‌ ఇప్పటికే ఫోన్‌ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. త్వరలో గూగుల్‌ పే, అమెజాన్‌ పే తో కూడా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు