Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇరు రాష్ట్రాల్లో ఒక పక్క భారీ వర్షాలు.. మరోవైపు పలు చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్న నేపథ్యంలో 21 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు దక్షిణ రైల్వే కీలక ప్రకటన చేసింది. పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నీరు నిలిచిందని, భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణలోని కేసముద్రం-మహబూబాబాద్ మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతిందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఇవాళ (సోమవారం) రద్దయిన 21 రైళ్ల జాబితాలో కాకినాడ పోర్ట్-లింగంపల్లి, సికింద్రాబాద్ -గూడూరు, బీదర్-మచిలీపట్నం, మచీలిపట్నం-బీదర్, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌తో పాటు పలు రైళ్లు ఉన్నాయి. ఇక దారి మళ్లించిన 12 రైళ్ల జాబితాలో 12763 తిరుపతి-సికింద్రాబాద్, 22352 ఎస్ఎంవీటీ బెంగళూరు-పాట్లీపుత్ర, 22674 మన్నార్గుడి-భగత్ కి కోతీ, 20805 విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖపట్నం-ముంబై, బీదర్-మధురైతో పాటు పలు రైళ్లు ఉన్నాయి. కాగా ప్రయాణికులకు అదనపు సమాచారం కోసం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్-27781500, వరంగల్-2782751, కాజీపేట-27782660, ఖమ్మం-2782885 నంబర్లను సంప్రదించవచ్చునని సూచించింది.
Admin
Studio18 News