Thursday, 05 December 2024 10:25:12 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Amaravati: అమరావతిలో అక్రమ లేఅవుట్లపై సీఆర్డీయే ఉక్కుపాదం.. రోడ్లు ధ్వంసం చేసి, హద్దురాళ్ల తొలగింపు

Date : 04 August 2024 11:15 AM Views : 41

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. దీనిని సొమ్ము చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లే అవుట్లతో చెలరేగిపోతున్నారు. సీఆర్డీఏ నుంచి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లగా విభజించి విక్రయించాలంటే నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించడంతోపాటు లాండ్ కన్వర్షన్ చేయించుకోవడం, ఆ తర్వాత ఆ భూమిలో పది శాతం స్థలాన్ని కామన్ సైట్‌గా ప్రభుత్వానికి అప్పగించడం వంటివి చేయాలి. అలాగే, వివిధ శాఖల నుంచి అనుమతులు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ పాటించకుండా తాడికొండ గ్రామ పరిసరాల్లో చాలా మంది తమ వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్లాట్లగా మార్చి లే అవుట్లు వేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సీఆర్డీఏ దృష్టి సారించింది. ప్రొక్లైయిన్‌తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాళ్లను తొలగించారు. వెంచర్లలో వేసిన రోడ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులకు సీఆర్డీఏ అధికారులు హెచ్చరికలు చేశారు. ఇలాంటి అక్రమ లేవుట్లలో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరించారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్ల విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు