Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ 4 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 590 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా... ప్రస్తుత నిల్వ 312 టీఎంసీలుగా ఉంది.
Admin
Studio18 News