Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ విద్యార్థి వేధిస్తున్నాడంటూ తన సోదరుడికి మెసేజ్ పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీ అధికారులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ను ఎంబీబీఎస్ విద్యార్థి రాహుల్ కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. లైంగిక వేధింపులకు గురిచేయడంతో ప్రదీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రాహుల్ వేధింపులు తట్టుకోవడం ఇక తన వల్ల కాదని, రాహుల్ కారణంగానే తాను చనిపోతున్నానని ప్రదీప్ సోమవారం రాత్రి తన సోదరుడికి మెసేజ్ పెట్టాడు. ఆపై కాలేజీ బిల్డింగ్ పైకెక్కిన ప్రదీప్.. పైనుంచి కిందకు దూకేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రదీప్ అక్కడికక్కడే చనిపోయాడు. విద్యార్థులు, కాలేజీ సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ప్రదీప్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రదీప్ ఆత్మహత్య విషయం తెలిసి నెల్లూరు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి మార్చురి ముందు ఆందోళన చేపట్టారు. తమ కొడుకు మరణానికి కారణమైన రాహుల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News