Thursday, 12 December 2024 01:23:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

తాడిపత్రిలో హై టెన్షన్‌.. భయపడే ప్రసక్తే లేదన్న వైసీపీ నేత మురళి

Date : 21 August 2024 02:53 PM Views : 39

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Tadipatri incident : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై వైసీపీ నేత కందిగొపుల మురళి మీడియాతో మాట్లాడారు. తన ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిపై స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల 40 నిమిషాల సమయంలో తన ఇంటిపై వందలాది మంది జేసీ అనుచరులు, టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని, మా ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి ఫర్మీచర్, టీవీ, ఇంట్లో సామాన్లన్నిటిని ధ్వంసం చేసి తగలబెట్టారని అన్నారు. వారు వచ్చేది చూసి మేము ఇంటి తలుపులు వేసుకొని ప్రాణ భయంతో బెడ్ రూమ్ లో తలదాచుకున్నాం. అయిన టీడీపీ శ్రేణులు, జేసీ అనుచరులు తలుపులు పగులగొట్టుకొని ఇంట్లోకి వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని మురళి వాపోయాడు. మేము దాక్కున్న బెడ్ రూమ్ తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేశారు. రూమ్ తలుపు తెరచుకోలేదు. టీడీపీ శ్రేణులు మామీద దాడి చేయాలని రుమ్ తలుపులు పగులగొడుతుంటే వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాను. మా ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నా లైసెన్స్ తుపాకి దగ్గరకు తీసుకున్నాను. వెంటనే పోలీసుల సైరన్ వినిపించడంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారని మురళి చెప్పాడు. కిటికీలో నుంచి బయటికి చూడగా.. బయట పోలీసులు, మాకు సంబంధించిన వారు కనబడటంతో బయటికి వచ్చాను. మా ప్రాణాలు కాపాడుకోవడంకోసం పోలీసులు ఉన్నప్పుడే తుపాకీ పట్టుకొని నిల్చున్నాను. కానీ, తుపాకీతో నేను టీడీపీ వారిని బెదిరించానని నాపై కంప్లెంట్ ఇచ్చారు. అయ్యా.. సీఎం చంద్రబాబు.. టీడీపీ పార్టీకోసం పనిచేసి సర్వస్వం కోల్పోయిన కుటుంబం మాది. తాడిపత్రిలో జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరుతున్నాను. నేను తప్పుచేసినట్లు తెలితే నాపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి. నాకు పిల్లలున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి పిల్లలున్నారు. నేను ఎవరినైనా భయపెట్టి ఉంటే తలవంచుతాను. మాఇంటిపై దాడి చేసిన వారిని వదిలేసి అన్యాయంగా నన్ను రాత్రి 11 గంటల వరకు పోలీస్టేషన్ లో పెట్టారు. అన్ని పోగొట్టుకొని ప్రాణాపాయస్థితిలో మేముఉంటే మాపైనే కేసులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. జేసీపై గతంలో నేను పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోవాలనే నాపై దాడులకు పాల్పడుతున్నారని మురళి అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను. మేము వైసీపీతోనే ఉంటాం. వైసీపీకోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ కోసం మేము అన్నీ పోగొట్టుకున్నాం. ఈరోజు కూడా జగనన్నకోసం ఎందాకైనా ఉంటాం. భయపెడితే ఊర్లు విడిచిపెట్టి పోయే ప్రసక్తే లేదు. పది రోజుల క్రితం కూడా జిల్లా ఎస్పీని కలసి నాకు గన్ మ్యాన్లను కేటాయించాలని కోరాను. 12సంవత్సరాలుగా ఉన్న గన్ మ్యాన్లను ఈప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించారని వైసీపీ నేత కందిగొగుల మురళి అన్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు