Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లాలోని కుప్పం వైసీీపీ కీలక నేత సెంథిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సెంథిల్ ముఖ్య అనుచరుడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్లపాటు సెంథిల్ రెస్కో ఛైర్మన్‌గా పని చేశారు. రెస్కో పరిధిలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో సెంథిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెస్కో ఎండీ సోమశేఖర్ ఫిర్యాదుపై రెస్కో మాజీ ఛైర్మన్ సెంథిల్‌తో పాటు మాజీ ఎండీ సుబ్రహ్మణ్యం, రెస్కో ఉద్యోగి మురుగేశ్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో 420, 406, 468, 409 IPC red with 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన సమయంలో సెంథిల్ తమిళనాడులో ఉన్నాడు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కారుపై బాంబులేస్తామంటూ అప్పట్లో సెంథిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News