Studio18 News - ANDHRA PRADESH / : అల్లూరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ పాలన సాగిస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్పోర్ట్ కు పెడతామని పేర్కోన్నారు. అల్లూరిని స్ఫూర్తిగా రేపటి తరం ఇటువంటి విప్లవకారులను స్మరిస్తూ వారి బాటలో వారి ఆశయసాధనకై నడవాలన్నారు. అందుకోసం స్వతంత్ర సమరయోధుల జయంతి వర్ధంతిలను తప్పక తమ ప్రభుత్వం జరిపిస్తుందన్నారు.
Also Read : GadwalJogulamba : ఎమ్మెల్యే పార్టీ మారితే దూకేస్తా
ADVT
Admin
Studio18 News