Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం నేడు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతల స్వీకరణ హాజరైన నారా లోకేశ్ చంద్రబాబును కలిసి ఆశీస్సులు అందుకున్న పల్లా
ఏపీ టీడీపీ చీఫ్ గా నియమితులైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావును టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. "తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఇవాళ బాద్యతలు చేపట్టిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారికి అభినందనలు. మీ సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలు సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, పల్లా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణపై నారా లోకేశ్ స్పందించారు. "మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యాను. బీసీ నేత, అజాతశత్రువు అయిన పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
Admin
Studio18 News