Sunday, 08 March 2026 10:37:33 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

విజయవాడలో వరదలు.. నారా లోకేశ్ కీలక ప్రతిపాదన.. అంగీకారం తెలిపిన మంత్రులు

Date : 03 September 2024 10:28 AM Views : 389

Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods: భారీవర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా బుడమేరు, కృష్ణా నది ఉప్పొంగాయి. దీంతో విజయవాడలోని అనేక కాలనీలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. మోకాళ్లలోతు నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు సహాయక చర్యల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. విజయవాడలో సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను మంత్రులు అంగీకరించారు. వరద నేపథ్యంలో ఆ వాహనాలను సహాయక చర్యలకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో నిత్యావసర వస్తువులు, భోజనం, తాగునీరు అందించే వాహనాలుగా ఎస్కార్ట్ మంత్రుల వాహనాలు వెళ్లనున్నాయి. అర్ధరాత్రి రేపల్లె మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గండి పడుతుందేమో అనే భయంతో రాత్రంతా కరకట్ట మీదే మంత్రులు కాపలాకాశారు. బలహీనపడిన రావి అనంతవరం కరకట్టను మంత్రులు పరిశీలించారు. పెనుమూడి ఘాట్ వద్ద వరద ఉధృతిపై అధికారులను మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలదిగ్భందం అయిన పెనుమూడి, పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని వారికి మంత్రులు భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :