Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pune Gold Man Family : గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ తిరుమలలో సందడి చేసింది. పుణెకి చెందిన గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ (సన్నీ వాగ్చోరి, సంజయ్ దత్తత్రయ గుజర్, ప్రీతీ సోని) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వారంతా భారీగా బంగారు ఆభరణాలు ధరించి శ్రీవార దర్శనానికి వచ్చారు. ఒంటి మీద 25 కిలోల పుత్తడి ఉంది. దాని విలువ రూ.15 కోట్ల రూపాయలు. వీరికి సెక్యూరిటీగా 10 మంది వరకు సిబ్బంది కూడా వెంట ఉన్నారు. భక్తులు, ఉద్యోగులు వీరిని ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు. వారితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.
Admin
Studio18 News