Thursday, 12 March 2026 03:41:46 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

AP Govt: పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీ స‌ర్కార్ అడుగులు

Date : 05 September 2024 12:18 PM Views : 283

Studio18 News - ANDHRA PRADESH / : పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీలోని కూట‌మి స‌ర్కార్ అడుగులేస్తోంది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా సామాజిక పింఛ‌న్ల పంపిణీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌కలకు ఆస్కారం లేకుండా స‌రికొత్త పధ్ధతితో ముందుకు వ‌స్తోంది. దీనిలో భాగంగా ప్ర‌భుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్ట‌ర్డ్‌) ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం రూ. 53కోట్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌య శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ స‌ర్వీసెస్ టెక్నాల‌జీ ద్వారా డివైజ్‌ల కొనుగోలుకు రాష్ట్ర స‌చివాల‌యాల శాఖ టెండ‌ర్లు ఆహ్వానించింది. అక్టోబ‌ర్ నుంచి 1.34ల‌క్ష‌ల కొత్త స్కాన‌ర్ల‌తో పింఛ‌న్ల పంపిణీ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం వినియోగంలో ఉన్న ఎల్ఓ ఆర్‌డీ స్కాన‌ర్ల‌లో సెక్యూరిటీ ప‌రంగా లోపాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాంతో న‌కిలీ వేలి ముద్ర‌ల‌ను ఉప‌యోగించి పింఛ‌న్లు స్వాహా చేస్తున్నార‌నే ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకే కూట‌మి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక పింఛన్ల బ‌దిలీ కోసం ప్ర‌భుత్వం సంబంధిత వెబ్‌సైట్‌లో ప్ర‌త్యేక ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి పింఛ‌న్ బ‌దిలీ కోసం ద‌ఖాస్తుదారులు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ పింఛ‌న్ ఐడీ, ఏ ప్రాంతానికి బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో ఆ జిల్లా, మండ‌లం, సచివాల‌యం వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ఇలా చేయ‌డం ద్వారా స్వ‌గ్రామాల‌కు రాలేనివారు తాము ఉంటున్న ప్రాంతాల్లోనే పింఛ‌న్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :