Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల పెన్షన్ అందుకుంటున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని, వారిని తొలగించే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. అయితే, అందులో చాలామంది బోగస్ సర్టిఫికెట్లు జతచేసి లబ్దిదారులుగా తమ పేరు నమోదు చేసుకున్నారని వివరించారు. ఇలాంటి వారిని గుర్తించి ఇప్పటికే నోటీసులు పంపించినట్లు మంత్రి పేర్కొన్నారు. మళ్లీ సదరం క్యాంపులు నిర్వహించి మిగతా అనర్హులను కూడా గుర్తిస్తామని చెప్పారు. నిజమైన దివ్యాంగులు, అవసరమైన వారికే ప్రభుత్వ సాయం అందేలా చూడడమే తమ లక్ష్యమని వివరించారు. ఇకపై దివ్యాంగ పెన్షన్ కోసం వచ్చే దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, బోగస్ సర్టిఫికెట్లతో దాఖలు చేసే వాటిని ప్రాథమిక స్థాయిలోనే పక్కన పెట్టాలని అధికారులకు మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆదేశించారు.
Admin
Studio18 News